బోర్ కొడుతుందని బయటకు వెళ్లిన దేశాధ్యక్షుడు.. గాయంతో ఇంటికి
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తింగా విలయతాండవం చేస్తోంది. కాగా ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ఇటీవల కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత క్వారంటైన్ కేంద్రానికే పరిమితమైపోయారు. అక్కడ చేసే పనేంలేక పోవడంతో బోరు కొడుతోదంటూ తెగ మారాం చేశారు. అదే ఊపులో అక్కడున్న పక్షులకు మేత వేయబోయి ఓ పక్షి చేత కరిపించుకున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తింగా విలయతాండవం చేస్తోంది. కాగా ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ఇటీవల కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత క్వారంటైన్ కేంద్రానికే పరిమితమైపోయారు. అక్కడ చేసే పనేంలేక పోవడంతో బోరు కొడుతోదంటూ తెగ మారాం చేశారు. అదే ఊపులో అక్కడున్న పక్షులకు మేత వేయబోయి ఓ పక్షి చేత కరిపించుకున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. మేత వేస్తున్న సందర్భంలో ఆయన కొవిడ్ నిబంధనలను కూడా పాటించారని సమాచారం. నోటికి మాస్కు పెట్టుకుని, భౌతిక దూరం కూడా పాటించారట. అయితే పక్షి ముక్కు కాస్త పదునుగా ఉండటంతో ఆహారం దాని నోటికి అందించేటప్పుడు అధ్యక్షుడి చేతికి గాయమైందట. పక్షి చేసిన పనికి చుర్రుమనడంతో ఆయన చేయి విదిలించుకుంటడా తీసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.