బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష సక్సెస్..

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల భారత్ నిర్వహించిన మిస్సైల్ పరీక్షలన్నీ విజయవంతం అవుతున్నాయి. దీంతో మన శాస్త్రవేత్తలు రెట్టింపు ఉత్సాహంతో నెలల వ్యవధిలోనే కొత్త క్షిపణులను లాంచ్ చేస్తూ విజయం సాధిస్తున్నారు. ఈ ప్రయోగాలపై దేశరక్షణ వర్గాలు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. పొరుగుదేశాలతో పొంచియున్న ముప్పు క్రమంలోనే భారత్ వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా DRDO అభివృద్ధి చేసిన బ్రహ్మెస్ సూపర్ సోనిక్ క్షిపణిని ఇవాళ INS […]

Update: 2020-10-18 04:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల భారత్ నిర్వహించిన మిస్సైల్ పరీక్షలన్నీ విజయవంతం అవుతున్నాయి. దీంతో మన శాస్త్రవేత్తలు రెట్టింపు ఉత్సాహంతో నెలల వ్యవధిలోనే కొత్త క్షిపణులను లాంచ్ చేస్తూ విజయం సాధిస్తున్నారు. ఈ ప్రయోగాలపై దేశరక్షణ వర్గాలు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. పొరుగుదేశాలతో పొంచియున్న ముప్పు క్రమంలోనే భారత్ వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా DRDO అభివృద్ధి చేసిన బ్రహ్మెస్ సూపర్ సోనిక్ క్షిపణిని ఇవాళ INS చెన్నై యుద్ధనౌక నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అరేబియా మహా సముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News