బీపీసీఎల్ కార్యకలాపాల ఆదాయంలో 41 శాతం క్షీణత

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL) 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం(net profit) 21.6 శాతం పెరిగి రూ. 2,187.74 కోట్లకు చేరుకుందని కంపెనీ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం (net profit)రూ. 1,799.59 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం 41.09 శాతం క్షీణించి రూ. 50,909.24 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 86,412.87 కోట్లుగా నమోదైనట్టు […]

Update: 2020-08-13 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL) 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం(net profit) 21.6 శాతం పెరిగి రూ. 2,187.74 కోట్లకు చేరుకుందని కంపెనీ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం (net profit)రూ. 1,799.59 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం 41.09 శాతం క్షీణించి రూ. 50,909.24 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 86,412.87 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing)లో తెలిపింది.

కొవిడ్-19(Kovid-19 ) వ్యాప్తి, లాక్‌డౌన్(Lockdown) కారణంగా సంస్థపై ప్రభావం చూపిందని, ముడి చమురు(Crude oil), పెట్రోలియం(Petroleum) ఉత్పత్తులకు డిమాండ్ తగ్గినట్టు కంపెనీ తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులు అత్యవసరమైన సేవల పరిధిలో ఉన్నప్పటికీ లాక్‌డౌన్ ప్రాభవంతో సంస్థ శుద్ధి(Organization refinement), మార్కెటింగ్ కార్యకలాపాల(Marketing activities)పై ప్రభావం పెరిగిందని, పెట్రోలియం ఉత్పాత్తుల డిమాండ్ లేమితో సంస్థ కార్యకలాపాల ఆదాయం తగ్గిందని కంపెనీ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా తిరిగి ప్రారంభమైనందున కార్యకలాపాల ఆదాయం క్రమంగా మెరుగుపడుతుందని,(Kovid-19 ) పరిస్థితులను అధిగమించి సాధారణ స్థాయికి చేరుకోనున్నట్టు కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News