సెల్ఫీలో బట్టబయలైన ప్రియురాలి లీలలు.. లబోదిబోమన్న ప్రియుడు

దిశ,వెబ్‌డెస్క్: టెక్ యుగంలో సెల్ఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెల్ఫీ తీసుకోవడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం… వచ్చే లైకులు, కామెంట్ల కోసం ఎదురు చూడడం క్రేజీగా మారింది. అలా ఓ ప్రేమికుడు తీసుకున్న సెల్ఫీతో ప్రియురాలు తనని మోసం చేస్తున్న విషయాన్ని గమనించాడు. ప్రియురాలు చేసిన మోసానికి సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. కెన్ వాంగ్ చైనాలో బాగా ఫేమస్. ఒక్క సెల్ఫీతో సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. ఓ రోజు […]

Update: 2021-02-11 01:17 GMT

దిశ,వెబ్‌డెస్క్: టెక్ యుగంలో సెల్ఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెల్ఫీ తీసుకోవడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం… వచ్చే లైకులు, కామెంట్ల కోసం ఎదురు చూడడం క్రేజీగా మారింది. అలా ఓ ప్రేమికుడు తీసుకున్న సెల్ఫీతో ప్రియురాలు తనని మోసం చేస్తున్న విషయాన్ని గమనించాడు. ప్రియురాలు చేసిన మోసానికి సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు.

కెన్ వాంగ్ చైనాలో బాగా ఫేమస్. ఒక్క సెల్ఫీతో సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. ఓ రోజు కెన్ వాంగ్ తన ప్రియురాలి బర్త్ ‌డే సందర్భంగా ఆమెకు విషెస్ చెప్పాలని.. ఆమె ఉండే ప్రాంతానికి ఫ్లవర్ బొకేతో వెళ్లాడు. అంతకంటే ముందే బర్త్ ‌డే సందర్భంగా ప్రియురాలికి ప్లవర్ బొకే ఇస్తున్నానంటూ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీలో కెన్వాంగ్ వెనకాల కొంత దూరంలో ఉన్న అతడి ప్రియురాలి లీలలు బయటపడ్డాయి. మరో యువకుడితో క్లోజ్ గా ఉన్న దృశ్యాలు కంటపడ్డాయి. అంతే ప్రియురాలి మోసంతో కన్నీరుమున్నీరయ్యాడు.

అనంతరం ఈ రోజు నా ప్రియురాలి బర్త్ డే. నేను ఆమెకు బొకే ఇచ్చేందుకు వచ్చా. కానీ తను వేరే యువకుడితే క్లోజ్ గా ఉండడాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News