ప్రియుడి ప్రాణం తీసిన ప్రియురాలి పుట్టిన రోజు

దిశ, కోదాడ: లవర్ బర్త్ డే విషెస్ తెలుపుతూ మేసేజ్ చేసిన బాయ్‌ఫ్రెండ్‌ను యువతి బంధువులు చితక్కొట్టారు. అవమానభారం, ప్రియురాలు దక్కదన్న బాధలో తీవ్రమనస్థాపానికి గురైన సదరు యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు(సోమవారం) మృతి చెందాడు. దీంతో తమ కొడుకు చావుకు ప్రియురాలి చుట్టాలే కారణమంటూ కొడుకు శవంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాలలో […]

Update: 2021-04-12 09:49 GMT

దిశ, కోదాడ: లవర్ బర్త్ డే విషెస్ తెలుపుతూ మేసేజ్ చేసిన బాయ్‌ఫ్రెండ్‌ను యువతి బంధువులు చితక్కొట్టారు. అవమానభారం, ప్రియురాలు దక్కదన్న బాధలో తీవ్రమనస్థాపానికి గురైన సదరు యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు(సోమవారం) మృతి చెందాడు. దీంతో తమ కొడుకు చావుకు ప్రియురాలి చుట్టాలే కారణమంటూ కొడుకు శవంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాలలో వెలుగుచూసింది.

పూర్తి వివరాళ్లోకి వెళితే.. ఇదే గ్రామానికి చెందిన లింగం నరేష్, మరో యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు. ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలియడంతో సదరు యువకుడిని తల్లిదండ్రులు హెచ్చరించారు. రెండు, మూడు సార్లు పెద్ద మనుషులను పిలిపించి పంచాయితీ పెట్టించారు. చాలాసార్లు మందలించారు. అయినప్పటికీ ఈ జంట.. ప్రేమ ప్రయాణం మాత్రం వదలుకోలేదు. పెద్దలు హెచ్చరిస్తున్నప్పటికీ మాట్లాడుకునేవారు. వీరి తీరుతో యువతి బంధువులు అతడిపై విపరీతంగా పగ పెంచుకున్నారు. అదును దొరికితే యువకుడిపై దాడి చేసేందుకు రెడీ అయ్యారు. ఇదే సమయంలో ప్రియురాలి పుట్టిన రోజు వారికి అవకాశం వచ్చింది.

చావుకి కారణమైన పుట్టిన రోజు..

సాధారణంగా ప్రియురాలి పుట్టిన రోజు అంటే ప్రియుడి ఆనందమే వేరు.. ఆమెతో కలిసే ఉండాలని ఎంతో ఆశపడుతాడు. కానీ, ఇక్కడ అదే ఆశ ప్రాణాల మీదకు తెచ్చింది. గత నెల(మార్చి) యువతి బర్త్ డే అని శుభాకాంక్షలు తెలుపుతూ నరేశ్ ఆమె మొబైల్‌కు మేసేజ్ పెట్టాడు. ఇది కాస్తా యువతి బంధువులు చూడడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే ప్రియుడి వద్దకు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు.. అవమానభారంతో గడ్డివాములోకి వెళ్లి పురుగుల మందు తాగేశాడు. తల్లిదండ్రులు వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 21 రోజులుగా చికిత్స తీసుకుంటున్న నరేశ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో సోమవారం కన్నుమూశాడు.

ఇక కొడుకు మృతిని తట్టుకోలేకపోయిన కుటుంబీకులు నేరుగా మృతదేహంతో ప్రియురాలి ఇంటికొచ్చారు. చావుకు కారణమైన వారిని వదిలిపెట్టమని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాల్సిందే అంటూ శవంతో అక్కడే భైఠాయించారు. ఇది తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. చావుకు కారణమైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కాసేపు ఆందోళన చేసిన బంధువులు అంతిమ సంస్కారాల కోసం మృత దేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Tags:    

Similar News