సహజీవనం ముసుగులో కిరాతకం

దిశ, వెబ్‌డెస్క్: ప్రియురాలితో సహజీవనం చేసిన ప్రియుడు దారుణం చేశాడు. తనతో కలిసి జీవించాలని ఆశపడితే ఏకంగా ఆయువు తీశాడు. ఎందుకు చంపాడో వివరాలు తెలియాల్సి ఉన్న ఒక నిండు జీవితాన్ని అయితే బలి తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. వివరాళ్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలపుది గ్రామానికి చెందిన సుజాత.. గిద్దలూరుకి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా విషయం తెలియడంతో […]

Update: 2020-10-24 05:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రియురాలితో సహజీవనం చేసిన ప్రియుడు దారుణం చేశాడు. తనతో కలిసి జీవించాలని ఆశపడితే ఏకంగా ఆయువు తీశాడు. ఎందుకు చంపాడో వివరాలు తెలియాల్సి ఉన్న ఒక నిండు జీవితాన్ని అయితే బలి తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది.

వివరాళ్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలపుది గ్రామానికి చెందిన సుజాత.. గిద్దలూరుకి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా విషయం తెలియడంతో కలిసి జీవించేందుకు కడపకు మకాం మార్చారు. కానీ, సుజాత ఆశల పై ప్రసాద్ నీళ్లు చల్లాడు. కడప జిల్లా చిట్వేలి మండలం పరిధి ఓ గ్రామానికి మకాం మార్చిన ప్రసాద్.. అదే గ్రామంలో ఓ రైతు మామిడితోటలో కూలిగా చేరాడు. అంత సవ్యంగా ఉందనుకున్న ప్రియురాలికి.. ప్రియుడి ఊహించని షాక్ ఇచ్చాడు.

అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో అతి కిరాతకంగా చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారి పోయాడు. ఈ ఘటన ఈ నెల 18న వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని వివరాలు సేకరించారు. ఇక నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చిట్వేలి బస్ స్టాప్ నుంచి వేరే ప్రాంతానికి పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు హత్య ఎందుకు చేశాడో అన్న అంశం పై విచారిస్తున్నారు.

Tags:    

Similar News