చెక్ డ్యామ్‌లో బాలుడి గల్లంతు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : చెక్ డ్యామ్ లో ఈతకు వెళ్లి బాలుడు గల్లంతు అయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లో కెళితే…బస్వగార్డెన్ ఏరియాకు చెందిన మంద సిద్ధార్థ్ (11) స్థానిక రాఘవ పబ్లిక్ స్కూల్‌లో నాల్గవ తరగతి చదువు తున్నాడు. దగ్గరలో ఉన్న పాంగ్రా వాగు చెక్ డ్యామ్ వద్దకు తన సోదరుడు ఉగ్లేశ్, మిత్రుడు నిఖిల్ తో కలసి సిద్దార్థ్ బుధవారం ఈతకు వెళ్లాడు. మిగిలిన ఇద్దరు గట్టు […]

Update: 2020-09-23 09:03 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :
చెక్ డ్యామ్ లో ఈతకు వెళ్లి బాలుడు గల్లంతు అయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లో కెళితే…బస్వగార్డెన్ ఏరియాకు చెందిన మంద సిద్ధార్థ్ (11) స్థానిక రాఘవ పబ్లిక్ స్కూల్‌లో నాల్గవ తరగతి చదువు తున్నాడు. దగ్గరలో ఉన్న పాంగ్రా వాగు చెక్ డ్యామ్ వద్దకు తన సోదరుడు ఉగ్లేశ్, మిత్రుడు నిఖిల్ తో కలసి సిద్దార్థ్ బుధవారం ఈతకు వెళ్లాడు. మిగిలిన ఇద్దరు గట్టు పైన ఉండగా సిద్దార్థ్ ఒక్కడే నీటిలో దిగాడు. కాగా లోతు ఎక్కువ ఉండటంతో ఈత రాక సిద్దార్థ్ నీటిలో గల్లంతు అయ్యాడు. గట్టుపైన ఉన్న ఉగ్లేష్, నిఖిల్ లు ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు. దీంతో పోలీసులకు బాలుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలను పోలీసులు చెప్పట్టారు. అయినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసు‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News