దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్ : వినోద్ కుమార్
దిశ, హుజురాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దళిత విద్యార్థుల కోసం హుజురాబాద్‌లో కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దళిత విద్యార్థుల ఉన్నత చదువులకు కోచింగ్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన హుజురాబాద్ కోర్టులో జిల్లా అదనపు న్యాయస్థానం ఏర్పాటు ఎంతో ముఖ్యమని దాని కోసం కృషి చేస్తానని తెలిపారు.సంచార జాతులను అన్ని రకాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. దళిత […]
దిశ, హుజురాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దళిత విద్యార్థుల కోసం హుజురాబాద్‌లో కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దళిత విద్యార్థుల ఉన్నత చదువులకు కోచింగ్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించారు.
మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన హుజురాబాద్ కోర్టులో జిల్లా అదనపు న్యాయస్థానం ఏర్పాటు ఎంతో ముఖ్యమని దాని కోసం కృషి చేస్తానని తెలిపారు.సంచార జాతులను అన్ని రకాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. దళిత మేధావుల సంఘం, సంచార జాతుల సంఘం సభ్యులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు ప్రకటించిన సందర్బంగా బోయినపల్లి వినోద్ కుమార్ ఈ హామీ ప్రకటించారు.