వాహనదారులకు విజ్ఞప్తి… ఇది తప్పక పాటించండి!

దిశ, డైనమిక్ బ్యూరో : బైక్ నడపే ముందు అందులో పెట్రోల్ ఉందా అని చూసుకోవడమే కాదు.. హెల్మెట్‌నూ తప్పకుండా ధరించాలంటున్నారు సైబరాబాద్ పోలీసులు. అయితే డ్రైవింగ్ చేసే వారు మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటే సరిపోతుందనుకుంటున్నారా.. కానీ ప్రమాదం జరిగినప్పుడు బైక్ పై ఉన్న ఇద్దరికీ ప్రాణహాని ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. దీనితో వాహనదారుల రక్షణకు కేంద్రం ఎంవీ చట్టంలో మార్పులు చేసి బైక్ పై వెళ్లే డ్రైవర్, పిలియన్ రైడర్లు ఇద్దరూ హెల్మెట్ వినియోగించాలని సవరించింది. […]

Update: 2021-09-05 09:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : బైక్ నడపే ముందు అందులో పెట్రోల్ ఉందా అని చూసుకోవడమే కాదు.. హెల్మెట్‌నూ తప్పకుండా ధరించాలంటున్నారు సైబరాబాద్ పోలీసులు. అయితే డ్రైవింగ్ చేసే వారు మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటే సరిపోతుందనుకుంటున్నారా.. కానీ ప్రమాదం జరిగినప్పుడు బైక్ పై ఉన్న ఇద్దరికీ ప్రాణహాని ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. దీనితో వాహనదారుల రక్షణకు కేంద్రం ఎంవీ చట్టంలో మార్పులు చేసి బైక్ పై వెళ్లే డ్రైవర్, పిలియన్ రైడర్లు ఇద్దరూ హెల్మెట్ వినియోగించాలని సవరించింది.

అయితే దీనిని ఆచరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే సైబరాబాదు కమిషనరేట్ పరిధిలో 2019లో 114, 2020లో 93, 2021ఆగస్టు వరకు 67 మంది పిలియన్ రైడర్లు ప్రమాదాల్లో చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సైబరాబాదు పోలీసులు “బైక్ పై ఉన్న ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి” అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News