భారత్‌లో ఊపందుకుంటోన్న ఆన్‌లైన్ గేమింగ్
సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ గేమింగ్ ప్రపంచం కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఒంటరిగా కూర్చుని ఆడుకునే వీడియో గేమ్‌లు కాస్త ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమాని మల్టీ ప్లేయర్ గేమ్‌లుగా మారిపోయాయి. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు రావడం, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయంతో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో కోట్లలో లాభాలు ఆర్జిస్తోంది. భారత్‌లో గేమింగ్ ఇండస్ట్రీ విపరీతంగా పెరిగిపోతోంది. కేపీఎంజీ వారి సర్వే ప్రకారం 2020 వరకు […]
సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ గేమింగ్ ప్రపంచం కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఒంటరిగా కూర్చుని ఆడుకునే వీడియో గేమ్‌లు కాస్త ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమాని మల్టీ ప్లేయర్ గేమ్‌లుగా మారిపోయాయి. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు రావడం, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయంతో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో కోట్లలో లాభాలు ఆర్జిస్తోంది.
భారత్‌లో గేమింగ్ ఇండస్ట్రీ విపరీతంగా పెరిగిపోతోంది. కేపీఎంజీ వారి సర్వే ప్రకారం 2020 వరకు ఈ రంగం 22 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. ఈ ఏడాది చివర్లోగా బిలియన్ డాలర్ల బిజినెస్ ఇది మారనుంది. స్థానిక పేర్లను టైటిల్‌లాగ పెట్టడం, ఫాంటసీ ఆటలు, గేమింగ్ స్టూడియోల్లో పెట్టుబడుల వల్ల గేమింగ్ పరిశ్రమ ఊపందుకుంటోంది.
క్లౌడ్ సర్వీసులు, లోకల్ గేమ్‌లు, ఫాంటసీ ఆటలు
గూగుల్ స్టేడియా, ఆపిల్ ఆర్కేడ్ వంటి ఆన్ డిమాండ్ క్లౌడ్ సర్వీస్ గేమింగ్ ప్లాట్‌ఫాంలు ఈ ఏడాది బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. నెలకు కొంత మొత్తం చెల్లించి టైటిళ్లు గెలుచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
ఇక లోకల్ గేముల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత సంస్కృతిలో మిళితమై ఉన్న లూడో, పులి మేక, రమ్మీ సర్కిల్, తీన్ పత్తి వంటి పేకాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక పండగలు, కొత్త సినిమాల ఇతివృత్తంతో వచ్చే ఆటలు కూడా ఆయా సీజన్లకు హాట్ కేకుల్లాగ మారుతున్నాయి. ఇక డ్రీమ్11 వంటి ఫాంటసీ ఆటలతో డబ్బులు సంపాదించే పోటీలో వినియోగదారులు తలమునకలవుతున్నారు. ఫాంటసీ గేముల వల్ల గేమింగ్ ఇండస్ట్రీ ఎదగడం ఒక రకంగా మంచిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.