మాస్క్ తీశాడని.. న్యాయవాదికి షాకిచ్చిన బాంబే హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కరోనా సోకి లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, లాక్‌డౌన్ కారణంగా చాలా మంది రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొన్నటిదాకా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు అనుహ్యంగా మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఒక్కరోజు వ్యవధిలోనే 4 వేల కరోనా కేసులు నమోదు కావడంతో […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కరోనా సోకి లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, లాక్‌డౌన్ కారణంగా చాలా మంది రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొన్నటిదాకా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు అనుహ్యంగా మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఒక్కరోజు వ్యవధిలోనే 4 వేల కరోనా కేసులు నమోదు కావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. దీంతో మళ్లీ అక్కడ లాక్‌డౌన్ పరిస్థితులు తలెత్తాయి. ప్రజలందరూ సేఫ్టీ మెజర్స్ పాటించాలని, మాస్కులు, శానిటైజర్స్ వాడాలని మహా సర్కార్ ఆదేశించింది.
ఈ క్రమంలోనే మాస్కు తొలగించిన కారణంగా న్యాయవాది అభ్యర్థనను వినేందుకు బాంబే హైకోర్టు తిరస్కరించింది. కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని న్యాయమూర్తి మార్గదర్శకాలు జారీ చేశారు. వాటిని ఉల్లంగిస్తూ మాస్కు తొలగించిన కారణంగా ఆ న్యాయవాది అభ్యర్థను జడ్జి తిరస్కరించడమే కాకుండా, అతని అభ్యర్థనను బోర్డు నుంచి తొలగించారు. ఇదిలాఉండగా, భౌతిక విచారణలను తిరిగి ప్రారంభించడానికి ముందు కోర్టు SOP లను సూచించిందిఇది కోర్టు హాలులో వాదనల సమయంలోనూ COVID-19 ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.