నో ఓటీటీ.. ఓన్లీ థియేటర్
కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో పెద్ద పెద్ద సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. వీటిలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కిలాడీ అక్షయ్ కుమార్ సూర్యవంశ్ కాగా.. క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రణ్‌వీర్ సింగ్ చిత్రం 83. ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఏడు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అవుతాయని ప్రకటించారు. దీంతో ఈ రెండు బడా ప్రాజెక్టులు కూడా అదే బాటలో విడుదల అవుతాయని అనుకున్నారు. […]
కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో పెద్ద పెద్ద సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. వీటిలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కిలాడీ అక్షయ్ కుమార్ సూర్యవంశ్ కాగా.. క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రణ్‌వీర్ సింగ్ చిత్రం 83.
ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఏడు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అవుతాయని ప్రకటించారు. దీంతో ఈ రెండు బడా ప్రాజెక్టులు కూడా అదే బాటలో విడుదల అవుతాయని అనుకున్నారు. కానీ అలాంటి అపోహలు పెట్టుకోవద్దంటూ ఆయా సినిమాల నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. రోహిత్ శెట్టి యాక్షన్ ఫిల్మ్ సూర్యవంశ్‌ను దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన సినిమాను కరణ్ జోహార్, రోహిత్ శెట్టి, యశ్ జోహార్, అపూర్వ మెహతా, అరుణ్ భాటియా నిర్మించగా.. తానిష్ బాగ్ చి సంగీతం అందించారు.
ఇక కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ రిలీజ్‌ను క్రిస్మస్‌కు ప్లాన్ చేశారు. భారతదేశ క్రికెట్ చరిత్రలో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా క్రిస్మస్‌కు పోస్ట్‌పోన్ అయిందని ప్రకటించారు పీవీఆర్ సినిమాస్.