అలుగులో కొట్టుకుపోయిన బొలెరో..

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో గత రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆత్మకూర్ (ఎస్) మండలం నసీంపేట వద్ద అలుగు ఉధృతిగా ప్రవహించింది. ఆ సమయంలో గొర్రెలు కొనుగోలు చేయడానికి జిల్లాకు బయలు దేరిన బొలెరో వాహనం నసీంపేట అలుగులో కొట్టుకుపోయింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకోగా, వాహనంలో ఉన్న దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకివెళితే.. మహబూబాబాద్ జిల్లా అలాదుతండాకు చెందిన దారావత్ కళ్యాణ్, భార్య సరోజ సొంత బొలెరో వాహనంలో గొర్రెలు కొనుగోలు […]

Update: 2020-09-14 00:14 GMT

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో గత రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆత్మకూర్ (ఎస్) మండలం నసీంపేట వద్ద అలుగు ఉధృతిగా ప్రవహించింది. ఆ సమయంలో గొర్రెలు కొనుగోలు చేయడానికి జిల్లాకు బయలు దేరిన బొలెరో వాహనం నసీంపేట అలుగులో కొట్టుకుపోయింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకోగా, వాహనంలో ఉన్న దంపతులు సురక్షితంగా బయటపడ్డారు.

వివరాల్లోకివెళితే.. మహబూబాబాద్ జిల్లా అలాదుతండాకు చెందిన దారావత్ కళ్యాణ్, భార్య సరోజ సొంత బొలెరో వాహనంలో గొర్రెలు కొనుగోలు కోసం సూర్యాపేటకు బయలు దేరారు. ఆ సమయంలో ఫుల్ వర్షం పడుతుండగా, నసీంపేట వద్ద అలుగు ఉధృతంగా పారుతోంది. నెమ్మదిగా దానిని దాటేందుకు ప్రయత్నించగా ప్రవాహం దాటికి బొలెరో కొట్టుకుపోగా, విద్యుత్ స్థంభం సపోర్టు వలన కొద్దిదూరంలో ఆగిపోయింది. ఈ ఘటన తెల్లవారు సుమారు 3 గంటలలో ప్రాంతంలో జరిగిందని స్థానికులు తెలిపారు. అదే సమయంలో సూర్యాపేట నుంచి ఏపూర్ వైపు వెళుతున్న ముగ్గురు వ్యక్తులు బొలెరోలో చిక్కుకున్న భార్యభర్తలు కళ్యాణ్, సరోజలను కాపాడారు.

Tags:    

Similar News