గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో బోయింగ్ 777 ల్యాండింగ్ విజయవంతం

దిశ, ఏపీ బ్యూరో: గన్నవరం విమానాశ్రయంలో బోయింగ్‌ 777 విమానం విజయవంతంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయంలో భారీ విమానాల సర్వీసుల కోసం ఇటీవలే కొత్తగా రన్‌వేను నిర్మించారు. గతంలో ఉన్న రన్‌వే 7,500 అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. ప్రస్తుతం 11,023 అడుగులకు పెంచారు. దీంతో భారీ విమాన సర్వీసులు దిగేందుకు వీలు కలిగింది. ఈ నేపథ్యంలోనే బోయింగ్‌ 777 విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేసి, తిరిగి టేకాఫ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. […]

Update: 2021-08-27 06:19 GMT

దిశ, ఏపీ బ్యూరో: గన్నవరం విమానాశ్రయంలో బోయింగ్‌ 777 విమానం విజయవంతంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయంలో భారీ విమానాల సర్వీసుల కోసం ఇటీవలే కొత్తగా రన్‌వేను నిర్మించారు. గతంలో ఉన్న రన్‌వే 7,500 అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. ప్రస్తుతం 11,023 అడుగులకు పెంచారు.

దీంతో భారీ విమాన సర్వీసులు దిగేందుకు వీలు కలిగింది. ఈ నేపథ్యంలోనే బోయింగ్‌ 777 విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేసి, తిరిగి టేకాఫ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ బోయింగ్ విమానాన్ని ఎయిర్ ఇండియా వన్‌గా పిలుస్తారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానిలు విదేశీ పర్యటనలకు ఈ విమానాలను వినియోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎయిర్‌బస్‌ ఎ380, ఎ340, బోయింగ్‌ 747, 777 లాంటి కోడ్‌ఈ స్థాయి విమానాలు రాకపోకలు సాగించవచ్చునని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News