బారికేడ్లకు వేలాడదీసి ఉన్న యువకుడి మృతదేహం
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా-ఢిల్లీ సరిహద్దు వద్ద ఆందోళన నిర్వహిస్తున్న రైతు వేదిక సమీపంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. రైతుల ఆందోళన వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన బారికేడ్లకు ఓ యువకుడి మృతదేహం వేలాడదీసి ఉండడం సంచలనం కలిగిస్తోంది. బారికేడ్ కు వేలాడదీసిన ఆ మృతదేహం చేతులు నరికేసి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ దారుణం చోటు […]
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా-ఢిల్లీ సరిహద్దు వద్ద ఆందోళన నిర్వహిస్తున్న రైతు వేదిక సమీపంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. రైతుల ఆందోళన వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన బారికేడ్లకు ఓ యువకుడి మృతదేహం వేలాడదీసి ఉండడం సంచలనం కలిగిస్తోంది. బారికేడ్ కు వేలాడదీసిన ఆ మృతదేహం చేతులు నరికేసి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ దారుణం చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆ యువకుడిని కట్టేసి ఉండగా.. పక్కన సిక్కు వారియర్ గ్రూప్ గా పిలువబడే నిహంగా యోధులు కనిపించారు. దాంతో ఈ దారుణానికి వారే పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన యువకుడిని గుర్తించాల్సి ఉంది. కాగా, ఆ యువకుడు సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ సాహిబ్ ను అవమాన పరిచాడని, అందుకే నిహంగాలు ఆ శిక్ష విధించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.