సీలేరు నదిలో నాటు పడవలు బోల్తా.. 8 మంది గల్లంతు

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నంలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. సీలేరు నదిలో వలస కూలీలతో వెళ్తున్న రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 8 మంది గల్లంతు అయ్యారు. ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే వలస కూలీలు విశాఖ నుంచి ఒడిషా వెళ్తుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు నాటు పడవల్లో 20 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన కూలీలు […]

Update: 2021-05-24 20:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నంలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. సీలేరు నదిలో వలస కూలీలతో వెళ్తున్న రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 8 మంది గల్లంతు అయ్యారు. ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే వలస కూలీలు విశాఖ నుంచి ఒడిషా వెళ్తుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు నాటు పడవల్లో 20 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగుడకు చెందిన వారిగా గుర్తించారు. లాక్‌డౌన్ కారణంగా వారంతా హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

 

Tags:    

Similar News