ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ చికిత్స

దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్ ఫంగస్ రోగులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. రాష్ట్రంలోని ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారని, దీని ద్వారా కరోనా రోగులను సులువుగా గుర్తించడం జరుగుతుందన్నారు. సర్వేలో కరోనా రోగులను గుర్తించిన తర్వాత తీవ్రతను బట్టి హాస్పిటల్స్‌లలో చేర్చడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో మధ్యాహ్నం, రాత్రి కర్ఫ్యూ విధించడం వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు […]

Update: 2021-05-17 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్ ఫంగస్ రోగులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. రాష్ట్రంలోని ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారని, దీని ద్వారా కరోనా రోగులను సులువుగా గుర్తించడం జరుగుతుందన్నారు.

సర్వేలో కరోనా రోగులను గుర్తించిన తర్వాత తీవ్రతను బట్టి హాస్పిటల్స్‌లలో చేర్చడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో మధ్యాహ్నం, రాత్రి కర్ఫ్యూ విధించడం వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు ఆళ్ల నాని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొంతమంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని, ఏపీలో పలు కేసులు వెలుగుచూశాయన్నారు.

Tags:    

Similar News