మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం.. నిప్పు పెట్టిన బీజేవైఎం

దిశ, మేడ్చల్: మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగ యువత, విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మేడ్చల్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నిరంజన్ రెడ్డికి గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా హమాలి పని చేసుకోవాలని వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదన్నారు. వెంటనే నిరుద్యోగులకు […]

Update: 2021-07-16 05:43 GMT

దిశ, మేడ్చల్: మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగ యువత, విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మేడ్చల్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నిరంజన్ రెడ్డికి గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా హమాలి పని చేసుకోవాలని వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదన్నారు. వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బీజేవైఎం అధ్యక్షుడు కానుకంటి వంశీ విజయ్, జిల్లా నాయకులు రాఘవ రెడ్డి, అర్జున్, నందు, ఆంజనేయులు ముదిరాజ్, మైసారి రాజు, లవంగ శ్రీకాంత్, ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News