సుందరీకరణ బాగుంది: హరీశ్ రావు
దిశ, మెదక్: మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులతో కళ్లు జిగేల్ మనేలా బీజేఆర్ జంక్షన్ సుందరీకరణ అదిరిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని బాబు జగ్జీవన్ రామ్ సర్కిల్ లో రూ. 22 లక్షల వ్యయంతో చేపట్టిన బీజేఆర్ జంక్షన్ సుందరీకరణ అభివృద్ధి పనులను ఆయన ఆవిష్కరించారు. అనంతరం సుడా కార్యాలయ ఆవరణలో రూ. 5 లక్షలతో నిర్మించిన ఫౌంటెయిన్, రూ.58 లక్షల వ్యయంతో పునరుద్ధరించిన సుడా చైర్మన్ […]
దిశ, మెదక్: మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులతో కళ్లు జిగేల్ మనేలా బీజేఆర్ జంక్షన్ సుందరీకరణ అదిరిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని బాబు జగ్జీవన్ రామ్ సర్కిల్ లో రూ. 22 లక్షల వ్యయంతో చేపట్టిన బీజేఆర్ జంక్షన్ సుందరీకరణ అభివృద్ధి పనులను ఆయన ఆవిష్కరించారు. అనంతరం సుడా కార్యాలయ ఆవరణలో రూ. 5 లక్షలతో నిర్మించిన ఫౌంటెయిన్, రూ.58 లక్షల వ్యయంతో పునరుద్ధరించిన సుడా చైర్మన్ హాల్, వైస్ చైర్మన్ హాల్, మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్, కార్యాలయ సిబ్బంది హాల్స్ ను మంత్రి.. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సుడా ప్రత్యేక అధికారి రమణాచారి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.