ముస్లింకు టికెట్ ఇవ్వం: బీజేపీ మంత్రి

బెంగళూర్: కర్ణాటకలోని బెలగావి లోక్‌సాభ స్థానం ఉపఎన్నికకు బీజేపీ.. ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వబోదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. హిందువులకు చెందిన ఏ కమ్యూనిటీ అభ్యర్థికైనా టికెట్ ఇస్తుందని, కానీ, ముస్లిం అభ్యర్థికి మాత్రం పార్టీ టికెట్ ఇవ్వదని స్పష్టం చేశారు. లింగాయత్‌లు, కురుబాలు, వొక్కలిగాలు, బ్రాహ్మణులు.. ఇంకా హిందు మతంలోని ఏ వర్గంవారికైనా టికెట్ ఇస్తుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే అభ్యర్దే టికెట్ పొందుతారని అన్నారు. బెలగావి హిందుత్వంకు కేంద్రమని, […]

Update: 2020-11-30 06:29 GMT

బెంగళూర్: కర్ణాటకలోని బెలగావి లోక్‌సాభ స్థానం ఉపఎన్నికకు బీజేపీ.. ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వబోదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. హిందువులకు చెందిన ఏ కమ్యూనిటీ అభ్యర్థికైనా టికెట్ ఇస్తుందని, కానీ, ముస్లిం అభ్యర్థికి మాత్రం పార్టీ టికెట్ ఇవ్వదని స్పష్టం చేశారు.

లింగాయత్‌లు, కురుబాలు, వొక్కలిగాలు, బ్రాహ్మణులు.. ఇంకా హిందు మతంలోని ఏ వర్గంవారికైనా టికెట్ ఇస్తుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే అభ్యర్దే టికెట్ పొందుతారని అన్నారు. బెలగావి హిందుత్వంకు కేంద్రమని, ఇక్కడ ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చే సవాలే లేదని చెప్పారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి కరోనా కారణంగా మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అయితే, బెలగావి పార్లమెంటు నియోజకవర్గ ఉపఎన్నికను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించాల్సి ఉన్నది.

Tags:    

Similar News