దళత, గిరిజన హక్కులకు బీజేపీ భంగం: ప్రియాంక

           ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పన అన్నది రాష్ట్రాల ప్రాథమిక హక్కేమీకాదన్న సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో.. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, బీజేపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు. దళితులకు, గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను బీజేపీ బలహీనపరుస్తున్నదని ఆరోపించారు. రిజర్వేషన్‌ విధానానికి బీజేపీ స్వస్తి పలకాలని చూస్తున్నదనీ, అందుకే ఆ పార్టీ పాలిత ఉత్తరాఖండ్ నుంచి రిజర్వేషన్ల ప్రాథమిక హక్కును రద్దు చేయాలని […]

Update: 2020-02-10 05:35 GMT

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పన అన్నది రాష్ట్రాల ప్రాథమిక హక్కేమీకాదన్న సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో.. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, బీజేపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు. దళితులకు, గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను బీజేపీ బలహీనపరుస్తున్నదని ఆరోపించారు. రిజర్వేషన్‌ విధానానికి బీజేపీ స్వస్తి పలకాలని చూస్తున్నదనీ, అందుకే ఆ పార్టీ పాలిత ఉత్తరాఖండ్ నుంచి రిజర్వేషన్ల ప్రాథమిక హక్కును రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిందని వెల్లడించారు. ఈ విధానాన్ని త్వరలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలుచేయనుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News