కేసీఆర్ జైలుకు..? బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వంద శాతం జైలుకు పంపుతామని నిజామాబాద్ఎంపీ ధర్మపురి అర్వింద్బాంబు పేల్చారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ త్వరలోనే విచారణ ప్రారంభిస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులుగా టీఆర్ఎస్ దొంగలు, గజదొంగ కేసీఆర్ చెప్పినట్లు పార్లమెంట్‌లో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. డీజిల్ ధరలు పెరిగినందున ఆర్టీసీ చార్జీలు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వంద శాతం జైలుకు పంపుతామని నిజామాబాద్ఎంపీ ధర్మపురి అర్వింద్బాంబు పేల్చారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ త్వరలోనే విచారణ ప్రారంభిస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులుగా టీఆర్ఎస్ దొంగలు, గజదొంగ కేసీఆర్ చెప్పినట్లు పార్లమెంట్‌లో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. డీజిల్ ధరలు పెరిగినందున ఆర్టీసీ చార్జీలు పెంచుతామని ప్రకటనలు చేయడం సిగ్గుచేటని విమర్శలు చేశారు.
రైతు ఉత్పత్తులపై టీఆర్ఎస్ నాయకులు స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేయాల్సింది ఢిల్లీలో కాదని, రైతులను మభ్యపెడుతున్న కేసీఆర్ ఎదుట చేయాలని అర్వింద్ సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజా సమస్యలు, రైతు, నిరుద్యోగ సమస్యలు, ఆర్టీసీ చార్జీల ధరల పెంపుపై పోరాడతామని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.