జగన్ నిర్ణయానికి బీజేపీ మద్దతు 

దిశ, వెబ్ డెస్క్ : ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద ఆటలను నిషేధిస్తూ గురువారం ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, రాష్ట్ర క్యాబినెట్‌కు అభినందనలు తెలిపారు. అనేక కుటుంబాలు, పిల్లలు ఈ వ్యసనానికి బానిసై ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వం చట్టం చేయడం మంచి నిర్ణయమని ప్రశంసించారు. ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలను నిషేధించడంతో యువతకు […]

Update: 2020-09-03 20:39 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద ఆటలను నిషేధిస్తూ గురువారం ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, రాష్ట్ర క్యాబినెట్‌కు అభినందనలు తెలిపారు.

అనేక కుటుంబాలు, పిల్లలు ఈ వ్యసనానికి బానిసై ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వం చట్టం చేయడం మంచి నిర్ణయమని ప్రశంసించారు. ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలను నిషేధించడంతో యువతకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News