పేపర్లో ఫొటో తప్పా… చుక్క నీరు కూడా రాలేదు
దిశ, దేవరకొండ: డిండి ప్రాజెక్టు వర్షం నీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఆయకట్టు పొలాలకు ఏటా 3 పంటలకు నీరందించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం డిండి ప్రాజెక్టు వద్ద ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జల పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కట్ట మైసమ్మ తల్లికి చీర సారె పెట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా […]
దిశ, దేవరకొండ: డిండి ప్రాజెక్టు వర్షం నీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఆయకట్టు పొలాలకు ఏటా 3 పంటలకు నీరందించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం డిండి ప్రాజెక్టు వద్ద ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జల పూజ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం కట్ట మైసమ్మ తల్లికి చీర సారె పెట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ డిండి ప్రాజెక్టు సందర్శించి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులోకి నీరు వస్తుందని, ప్రజలు అధైర్య పడొద్దని ప్రకటించి పేపర్లో వేయించుకున్నారు తప్ప నేటికీ ఒక్క చుక్క నీరు కూడా రాలేదని విమర్శించారు. ప్రతి ఏటా వర్షాలతో ప్రాజెక్టు నిండి ఆయకట్టు రైతులకు సరిపడ నీరు అందేవిధంగా వరుణుడు కరుణించాలని కోరారు.