బీజేపీ సీనియర్ నేత ఆత్మహత్య

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణ ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు జీఎస్ బావా ఆత్మహత్య చేసుకున్నారు. బావా పశ్చిమ ఢిల్లీలోని ఫతేనగర్ లో నివసిస్తున్నారు. అయితే అతను నిన్న సాయత్రం తన ఇంటి సమీపంలోని పార్క్ లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతున్న బావాని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తన కుటుంబ సమస్యల వలనే తాను ఈ నిర్ణయం […]

Update: 2021-03-29 22:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణ ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు జీఎస్ బావా ఆత్మహత్య చేసుకున్నారు. బావా పశ్చిమ ఢిల్లీలోని ఫతేనగర్ లో నివసిస్తున్నారు. అయితే అతను నిన్న సాయత్రం తన ఇంటి సమీపంలోని పార్క్ లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతున్న బావాని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తన కుటుంబ సమస్యల వలనే తాను ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్టుగా వారు తెలిపారు. ఆయన వద్ద నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News