జగన్ కంటే బాబే కఠినంగా వ్యవహరించారు: జీవీఎల్
దిశ వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర రెండు జిల్లా ప్రజా చైనత్య యాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. బాబు పర్యటన సందర్భంగా విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలకంటే గతంలో టీడీపీ ఇంకా దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడానికి కారకుడు చంద్రబాబేనని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉండగా, జగన్‌కు ఇదే రీతిలో అవమానం జరగలేదా? అని ఆయన […]
దిశ వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర రెండు జిల్లా ప్రజా చైనత్య యాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. బాబు పర్యటన సందర్భంగా విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలకంటే గతంలో టీడీపీ ఇంకా దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడానికి కారకుడు చంద్రబాబేనని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉండగా, జగన్‌కు ఇదే రీతిలో అవమానం జరగలేదా? అని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు ఆయన సీఎంగా ఉండగా కేంద్రాన్ని రాష్ట్రంలో అడుగుపెట్టవద్దని హుకుం జారీ చేయలేదా? అంటూ టీడీపీని జీవీఎల్ నిలదీశారు. ఏది ఏమైనప్పటికీ సీనియర్ రాజకీయ నాయకుడిపై కోడిగుడ్లతో దాడి చేయడం సరైన సంస్కృతి కాదని ఆయన హితవు పలికారు.