వివాదంలో 'భీష్మ'

భీష్మ… నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమాకు మహాభారతంలో భీష్ముడి పేరు పెట్టడంతో వివాదాల్లో చిక్కుకుంటోంది. సినిమా పేరుతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ తూములూరి శ్రీకృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట కోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడి పేరును లవర్ బాయ్ పాత్రకు పెట్టి కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టైటిల్ వెంటనే మార్చాలని డిమాండ్ […]

Update: 2020-02-19 05:04 GMT

భీష్మ… నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమాకు మహాభారతంలో భీష్ముడి పేరు పెట్టడంతో వివాదాల్లో చిక్కుకుంటోంది. సినిమా పేరుతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ తూములూరి శ్రీకృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట కోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడి పేరును లవర్ బాయ్ పాత్రకు పెట్టి కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టైటిల్ వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో వెంటనే చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, డైరెక్టర్ హరీశ్‌శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన వాల్మీకి సినిమా టైంలో కూడా ఇలాంటి హెచ్చరికలే వచ్చాయ్. దీంతో రాత్రికి రాత్రి సినిమా పేరును గద్దలకొండ గణేష్‌గా మార్చి రిలీజ్ చేయాల్సి వచ్చింది. సినిమా విడుదలకు రెండు రోజుల సమయం ఉండగా ఇలాంటి అడ్డంకులు ఎదుర్కొంటున్న భీష్మ మూవీ యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News