ఏపీకి నాలుగు గ్రహణాలు పట్టాయి: జీవీఎల్

దిశ, వెబ్‌ డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మట్లాడుతూ… ఏపీకి నాలుగు గ్రహణాలు పట్టాయని తెలిపారు. కరప్షన్, క్యాస్ట్, కుటుంబం, కుహనా రాజకీయాల నుంచి ఏపీని తప్పించాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం జీవీఎల్ అభిప్రాయపడ్డారు. రెండు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. గతంలో జరిగిన అవినీతి వెలికితీయడంలో ప్రస్తుత ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎద్దేవా చేశారు. […]

Update: 2020-06-26 07:17 GMT

దిశ, వెబ్‌ డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మట్లాడుతూ… ఏపీకి నాలుగు గ్రహణాలు పట్టాయని తెలిపారు. కరప్షన్, క్యాస్ట్, కుటుంబం, కుహనా రాజకీయాల నుంచి ఏపీని తప్పించాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం జీవీఎల్ అభిప్రాయపడ్డారు. రెండు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. గతంలో జరిగిన అవినీతి వెలికితీయడంలో ప్రస్తుత ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎద్దేవా చేశారు. అవినీతి జరిగిందని తెలిసినా, ఎవరిపైనా చర్యలు లేవంటే టీడీపీతో వైసీపీ లాలూచీ పడిందేమోనన్న అనుమానం వస్తోందన్నారు. కుటుంబ రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలకాలని తెలిపారు.

Tags:    

Similar News