బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం..
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సుభాష్ చంద్ర పానిగ్రహి ఈ దారుణానికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఒడిశాలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో డియోగర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పానిగ్రహి రైతుల సమస్యల గురించి మంత్రిని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి రణేంద్ర ప్రతాప్ స్వైన్ అసెంబ్లీ వేదికగా సమాధానమిస్తుండగా.. పానిగ్రహి ఒక్కసారిగా […]
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సుభాష్ చంద్ర పానిగ్రహి ఈ దారుణానికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఒడిశాలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో డియోగర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పానిగ్రహి రైతుల సమస్యల గురించి మంత్రిని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి రణేంద్ర ప్రతాప్ స్వైన్ అసెంబ్లీ వేదికగా సమాధానమిస్తుండగా.. పానిగ్రహి ఒక్కసారిగా శానిటైజర్ తీసుకొని తాగబోయాడు. వెంటనే స్పందించిన తోటి శాసనసభ్యులు.. శానిటైజర్ లాక్కొని అతడిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పానిగ్రహి మాట్లాడుతూ.. అధికార బీజేడీ ప్రభుత్వం మా ప్రాంతంలో వరి కొనుగోళ్లను చేపట్టడం లేదు. రైతుల సమస్యలపై ఎన్నిసార్లు గొంతు వినిపించినా ప్రభుత్వం స్పందించడంలేదు. ఈ ప్రభుత్వం నాకు వేరే మార్గం లేకుండా చేసింది. అందుకే నేను శానిటైజర్ తాగడానికి ప్రయత్నించాను తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పానిగ్రాహి ఆరోపించారు.