ఓవైసీ నా వద్దకు వస్తే ఆ బిర్యాని తినిపిస్తా
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్ధిన్ ఓవైసీని పాతబస్తీ ప్రజలు నమ్మడం లేదని , వారిని త్వరలోనే ప్రజలు బహిష్కరిస్తారని గోషామహల్ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ఫ్రస్టేషన్లో ఉందని, వారికి బిర్యాని తినిపించాలని అసదుద్దిన్ ఓవైసీ పాత బస్తీలో చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఓవైసీ తన వద్దకు వస్తే పంది బిర్యాని తినిపిస్తానని పేర్కొన్నారు. వరద ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు […]
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్ధిన్ ఓవైసీని పాతబస్తీ ప్రజలు నమ్మడం లేదని , వారిని త్వరలోనే ప్రజలు బహిష్కరిస్తారని గోషామహల్ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ఫ్రస్టేషన్లో ఉందని, వారికి బిర్యాని తినిపించాలని అసదుద్దిన్ ఓవైసీ పాత బస్తీలో చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఓవైసీ తన వద్దకు వస్తే పంది బిర్యాని తినిపిస్తానని పేర్కొన్నారు.
వరద ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఓవైసీ మాత్రం హిందూ, ముస్లీంల మద్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాతబస్తీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, వాటిని పరిష్కరించడంలో ఎంఐఎంతో పాటు టీఆర్ఎస్ కూడా ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. బీజేపీతోనే మార్పు సాథ్యమని ఆయన అన్నారు.