మహిళా కార్యకర్తపై ఎమ్మెల్యే అత్యాచారం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎమ్మెల్యే దారుణానికి ఒడిగట్టారు. ఆ పార్టీకి చెందిన ఓ మహిళ కార్యకర్తపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మహిళా కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ రాథోర్.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ బేగంపూర గ్రామానికి చెందిన బీజేపీ మహిళా కార్యకర్త పోలీసులకు ఆశ్రయించారు. ఎమ్మెల్యే కొద్ది నెలల క్రితం తనపై అత్యాచారం చేశారని ఆమె […]

Update: 2021-07-03 22:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎమ్మెల్యే దారుణానికి ఒడిగట్టారు. ఆ పార్టీకి చెందిన ఓ మహిళ కార్యకర్తపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మహిళా కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ రాథోర్.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ బేగంపూర గ్రామానికి చెందిన బీజేపీ మహిళా కార్యకర్త పోలీసులకు ఆశ్రయించారు. ఎమ్మెల్యే కొద్ది నెలల క్రితం తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ మహిళను ఎమ్మెల్యే సురేష్ హెచ్చరించారని తెలిపారు.

అయితే, ఈ విషయంపై ఎమ్మెల్యే సురేష్ రాథోర్ స్పందించారు. కొందరు నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా జీవితం ప్రమాదంలో పడింది. ప్రజలు నాపై కుట్ర పన్ని తప్పుడు కేసు పెట్టించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి అసలు వాస్తవాలు బయట పెట్టాలని అప్పీలు చేస్తున్నాని చెప్పారు. విచారణలో కోర్టుకు, పోలీసులకు సహకరిస్తాను. అయితే నా ప్రాణాలకు ముప్పు ఉంది. అందుకే రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరుతున్నాను. నాపై వచ్చిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవని తెలిపారు.

ఇక, ఈ ఘటన‌పై హరిద్వార్ ఎస్‌ఎస్‌పీ అబుదాయి క‌ృష్ణారాజ్ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సురేష్ రాథోర్‌పై ఐపీసీ 376, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.

Tags:    

Similar News