వాటిని అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం విఫలం : రఘునందన్ రావు

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రచందన్ స్మగ్లింగ్‌ను అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అంతేగాకుండా.. శ్రీవారి హుండీ ఆదాయంలో పదిశాతం హిందూ ధర్మ ప్రచారానికి వినియోగించాలని డిమాండ్ చేశారు. దూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించాలని కోరారు. కాగా, తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున శనివారం రఘునందనరావు ప్రచారం నిర్వహించారు. తిరుపతిలో బీజేపీకి ఉన్న బలమేమిటో.. మే 2వ తేదీన వచ్చే […]

Update: 2021-04-03 23:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రచందన్ స్మగ్లింగ్‌ను అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అంతేగాకుండా.. శ్రీవారి హుండీ ఆదాయంలో పదిశాతం హిందూ ధర్మ ప్రచారానికి వినియోగించాలని డిమాండ్ చేశారు. దూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించాలని కోరారు. కాగా, తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున శనివారం రఘునందనరావు ప్రచారం నిర్వహించారు. తిరుపతిలో బీజేపీకి ఉన్న బలమేమిటో.. మే 2వ తేదీన వచ్చే తీర్పులో తెలుస్తుందని తెలిపారు.

Tags:    

Similar News