మళ్లీ వికసించిన కమలం

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. రౌండ్, రౌండ్ కు వస్తున్న ఫలితాలు ఇరు పార్టీల శ్రేణులను టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఎనిమిది రౌండ్లల్లో బీజేపీ ఆరు రౌండ్లు ఆధిక్యంలో ఉండగా.. టీఆర్ఎస్ రెండు రౌండ్లలో వెనకబడింది. ఇప్పటివరకు జరిగిన మొత్తం తొమ్మిది రౌండ్ల లెక్కింపులో 9వ రౌండ్ లోనే బీజేపీకి అత్యధికంగా ఆధిక్యత లభించింది. ఈ ఒక్కరౌండ్ లోనే 1084 […]

Update: 2020-11-10 01:55 GMT

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. రౌండ్, రౌండ్ కు వస్తున్న ఫలితాలు ఇరు పార్టీల శ్రేణులను టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఎనిమిది రౌండ్లల్లో బీజేపీ ఆరు రౌండ్లు ఆధిక్యంలో ఉండగా.. టీఆర్ఎస్ రెండు రౌండ్లలో వెనకబడింది. ఇప్పటివరకు జరిగిన మొత్తం తొమ్మిది రౌండ్ల లెక్కింపులో 9వ రౌండ్ లోనే బీజేపీకి అత్యధికంగా ఆధిక్యత లభించింది. ఈ ఒక్కరౌండ్ లోనే 1084 ఓట్లను టీఆర్ఎస్ కంటే ఎక్కువగా గెల్చుకుంది. దీంతో తొమ్మిది రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత బీజేపీ 4190 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కాగా ఫలితాల సరళిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు టీవీల్లో వీక్షిస్తున్నారు.

కాగా తొమ్మిదో రౌండ్‌లో బీజేపీకి 29,291, టీఆర్ఎస్‌కు 25,101, కాంగ్రెస్‌కు 5,800 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి 3106 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 66807 ఓట్లను లెక్కించారు. నోటాకు 240 ఓట్లు పడ్డాయి.

Tags:    

Similar News