కేంద్రం స్పందించేవరకూ.. జగన్ మేల్కొలేదు

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం స్పందిస్తే కానీ సీఎం జగన్ మేల్కొనడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీది ముగిసిన అధ్యయనం అని ఆయన వెల్లడించారు. తెలంగాణలో కూర్చొని ఏపీ ప్రజల కోసం మాట్లాడటం తప్పా ఇక వాళ్లు చేసేది ఏమీ లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రూ.50 […]

Update: 2020-10-22 02:36 GMT
కేంద్రం స్పందించేవరకూ.. జగన్ మేల్కొలేదు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం స్పందిస్తే కానీ సీఎం జగన్ మేల్కొనడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీది ముగిసిన అధ్యయనం అని ఆయన వెల్లడించారు.

తెలంగాణలో కూర్చొని ఏపీ ప్రజల కోసం మాట్లాడటం తప్పా ఇక వాళ్లు చేసేది ఏమీ లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రూ.50 వేల చీర కట్టుకుని రైతులతో ఒకరు పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇంకొకరేమో ఉదయాన్నే పేపర్ చూసి లేఖలు రాసే స్క్రోలింగ్ స్టార్ అని ఎద్దేవా చేశారు. స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News