మంత్రి ‘కొడాలి’ని బర్తరఫ్ చేయాలి

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి ఆలయంలో అన్య మతస్థుల డిక్లరేషన్ అంశంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. సీఎం జగన్ డిక్లరేషన్‌పై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడమే కాకుండా, నిన్న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపాయి. సీఎం జగన్‌కు డిక్లరేషన్ వర్తించదని, అవసరం అయితే టీటీడీ నుంచి ఆ నిబంధనను తొలగించాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు శ్రీవారికి సతీ […]

Update: 2020-09-24 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

తిరుమల శ్రీవారి ఆలయంలో అన్య మతస్థుల డిక్లరేషన్ అంశంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. సీఎం జగన్ డిక్లరేషన్‌పై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడమే కాకుండా, నిన్న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపాయి. సీఎం జగన్‌కు డిక్లరేషన్ వర్తించదని, అవసరం అయితే టీటీడీ నుంచి ఆ నిబంధనను తొలగించాలని ఆయన వ్యాఖ్యానించారు.

అంతకుముందు శ్రీవారికి సతీ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలని లేకపోతే రాష్ట్రానికి అరిష్టమని మాజీ సీఎం చంద్రబాబు తెలపగా.. పీఎం మోడీని సతీసమేతంగా పట్టువస్త్రాలు ఇప్పించాలని మంత్రి కొడాలి వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే కొడాని నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రి వర్గం బాధ్యత తీసుకుని ఆయన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News