విషాదం.. బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు

దిశ, వెబ్‌‌డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాంలో బీజేపీ నేత జావీద్ అహ్మద్ దర్‌పై ఉగ్రవాదులు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో జావీద్ మృతి చెందారు. ఉగ్రవాదుల దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాల్పులు జరిపిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే జావీద్ అహ్మద్ కాశ్మీర్‌లోని షాలిబుగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.

Update: 2021-08-17 11:47 GMT

దిశ, వెబ్‌‌డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాంలో బీజేపీ నేత జావీద్ అహ్మద్ దర్‌పై ఉగ్రవాదులు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో జావీద్ మృతి చెందారు.

ఉగ్రవాదుల దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాల్పులు జరిపిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే జావీద్ అహ్మద్ కాశ్మీర్‌లోని షాలిబుగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.

Tags:    

Similar News