పీవీ సంస్కరణల వల్లే దేశం ఈ స్థాయికి వచ్చింది: లక్ష్మణ్
దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టించారని బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆరేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో సంస్కరణలను అమలు చేశారని, దేశానికి మేలు చేసే అంశాలపై రాద్దాంతం చేయడం వామపక్షాలకు అలవాటుగా మారిందని ఆరోపించారు. గతంలో పీవీ ఆర్థిక సంస్కరణలను కూడా వామపక్షాలు తప్పు బట్టాయన్న లక్ష్మణ్.. పీవీ ఆర్థిక సంస్కరణల వల్లే దేశం ఈ స్థాయికి వచ్చిందని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం వల్ల వస్తువుల ధరలు తగ్గి నాణ్యత పెరుగుతుందన్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టించారని బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆరేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో సంస్కరణలను అమలు చేశారని, దేశానికి మేలు చేసే అంశాలపై రాద్దాంతం చేయడం వామపక్షాలకు అలవాటుగా మారిందని ఆరోపించారు. గతంలో పీవీ ఆర్థిక సంస్కరణలను కూడా వామపక్షాలు తప్పు బట్టాయన్న లక్ష్మణ్.. పీవీ ఆర్థిక సంస్కరణల వల్లే దేశం ఈ స్థాయికి వచ్చిందని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం వల్ల వస్తువుల ధరలు తగ్గి నాణ్యత పెరుగుతుందన్నారు. గురువారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.