హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదాలు : డీకే అరుణ
దిశ, తెలంగాణ బ్యూరో: అధికారం, డబ్బు అహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విర్రవీగారని, అందుకే హుజురాబాద్ ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పారని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో నియంత పాలనకు చరమగీతం పాడాలనే పిలుపును హుజురాబాద్ ప్రజలిచ్చారని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆరే హుజురాబాద్ అభ్యర్థి అయినట్లుగా ఎన్నికలు జరిగాయని, చరిత్రలో ఎక్కడా ఖర్చు పెట్టనంత డబ్బును ఈ ఉప ఎన్నికల […]
దిశ, తెలంగాణ బ్యూరో: అధికారం, డబ్బు అహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విర్రవీగారని, అందుకే హుజురాబాద్ ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పారని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో నియంత పాలనకు చరమగీతం పాడాలనే పిలుపును హుజురాబాద్ ప్రజలిచ్చారని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆరే హుజురాబాద్ అభ్యర్థి అయినట్లుగా ఎన్నికలు జరిగాయని, చరిత్రలో ఎక్కడా ఖర్చు పెట్టనంత డబ్బును ఈ ఉప ఎన్నికల కోసం కేసీఆర్ ఖర్చు చేశారని అరుణ ఆరోపించారు.
బీజేపీ సభలు, సమావేశాలకు జనం రాకుండా ఉండేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రజలకు డబ్బులు పంచారని, గ్రామాల్లో ప్రజలను బెదిరించి మరీ సభకు రాకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపణలు చేశారు. హుజురాబాద్ ప్రజలిచ్చిన తీర్పు చరిత్రాత్మకమని ఆమె అభివర్ణించారు. ప్రతి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం కనబరచడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. ఈటల భారీ విజయాన్ని సాధిస్తారని, ఈ విషయం తమకు ముందే తెలుసని ఆమె అన్నారు. హుజురాబాద్ ప్రజలు విశ్వాసంతో ఈటలకు ఓటు వేశారని, వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని నియోజకవర్గం, గ్రామీణస్థాయికి విస్తరించి బలమైన శక్తిగా ఎదుగుతామని తెలిపారు. హుజురాబాద్ విజయం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రజల విజయంగా డీకే అరుణ అభివర్ణించారు.