కేంద్ర మంత్రులకు లేఖ రాశా: లక్ష్మణ్
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై గుట్టురట్టు చేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ కేంద్ర బృందాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన చేశారు. హైదరాబాద్ మహానగరంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్న తీరుపై, టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం పై కేంద్ర మంత్రులు అమిత్‌షా, హర్షవర్దన్‌లకు లేఖ రాశినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోని రాష్ట్రానికి ఉన్నతస్థాయి బృందాన్ని పంపాలని కోరానని తెలిపారు. […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై గుట్టురట్టు చేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ కేంద్ర బృందాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన చేశారు. హైదరాబాద్ మహానగరంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్న తీరుపై, టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం పై కేంద్ర మంత్రులు అమిత్‌షా, హర్షవర్దన్‌లకు లేఖ రాశినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోని రాష్ట్రానికి ఉన్నతస్థాయి బృందాన్ని పంపాలని కోరానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లేఖను పరిగణలోకి తీసుకోని ఉన్నతస్థాయి బృందాన్ని రాష్ట్రానికి పంపడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై గుట్టురట్టు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని, కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నందున కరోనా టెస్టుల సంఖ్యను పెంచేవిధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా లక్ష్మణ్ కోరారు.