దొంగ ఓట్లు: బీజేపీ, జనసేన నిరసన

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల పోలింగ్‌లో వైసీపీకి చెందిన దొంగ ఓటర్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. దీనిని నిరసనగా బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు తిరుపతి ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించారు. తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. అధికార వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. అటు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల పరిశీలకులను కలిసి […]

Update: 2021-04-17 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల పోలింగ్‌లో వైసీపీకి చెందిన దొంగ ఓటర్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. దీనిని నిరసనగా బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు తిరుపతి ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించారు. తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. అధికార వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.

అటు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల పరిశీలకులను కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. తిరుపతి నగరం ఎంతోమంది విద్యావంతులకు నిలయమని, ప్రతిఒక్కరూ అభివృద్ధిని కోరుకుంటున్నారని రత్నప్రభ చెప్పారు.

Tags:    

Similar News