బీజేపీకి రాష్ట్రంలో ఉండే హక్కు లేదు.. వైసీపీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య

దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ, వైసీపీల మధ్య ఇంధన ధరలు తగ్గింపు అంశం చిచ్చు పెట్టింది. ఇంధన ధరలు కేంద్రమే తగ్గించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే తాము తగ్గించామని రాష్ట్రప్రభుత్వం తగ్గించడం లేదని బీజేపీ వాదిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంధన ధరలపై బీజేపీ వర్సెస్ వైసీపీగా రాజకీయాలు మారిపోయాయి. తాజాగా ఈ ఇంధన ధరల తగ్గింపుపై వైసీపీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కడప వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… […]

Update: 2021-11-09 04:29 GMT

దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ, వైసీపీల మధ్య ఇంధన ధరలు తగ్గింపు అంశం చిచ్చు పెట్టింది. ఇంధన ధరలు కేంద్రమే తగ్గించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే తాము తగ్గించామని రాష్ట్రప్రభుత్వం తగ్గించడం లేదని బీజేపీ వాదిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంధన ధరలపై బీజేపీ వర్సెస్ వైసీపీగా రాజకీయాలు మారిపోయాయి. తాజాగా ఈ ఇంధన ధరల తగ్గింపుపై వైసీపీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కడప వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం పెంచుకుంటూ పోతుందని ఆరోపించారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న తరుణంలో పెట్రోల్, డీజల్‌పై రేట్లు తగ్గించి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రాలు కూడా ధరలు తగ్గించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ బీజేపీ నేతలు పెట్రోల్, డీజల్‌పై సెస్ తగ్గించాలని కేంద్రాన్ని కోరాలని సూచించారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రం వద్దకు సమస్యలను తీసుకెళ్లే సత్తా లేదు. ప్రజల బాగోగులు పట్టని బీజేపీకి రాష్ట్రంలో ఉండే హక్కు లేదని విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కు కాపాడుతమని రాష్ట్ర బీజేపీ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.

మోడీ రాష్ట్రానికి చేసింది శూన్యమే

బీజేపీ దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. బీజేపీ నిత్యం మాట తప్పడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ప్రధాని మోడీ నల్లధనాన్ని బయటికి తీస్తామని ప్రజలను నమ్మించారని విమర్శించారు. 2014 ఎన్నికలకు ముందు స్విస్ బ్యాంక్ నుంచి నల్ల ధనాన్ని తెచ్చి ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని మోసం చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల ఇస్తామని మోసం చేయలేదా అని ప్రశ్నించారు. కడప ఉక్కు, విశాఖ ఉక్కు విషయంలో మాట నిలబెట్టుకోలేదన్న.. రామచంద్రయ్య కొవిడ్‌ విపత్కర సమయంలో ప్రైవేటు కంపెనీలకు లాభం చేకూర్చేలా కేంద్ర నిర్ణయాలు తీసుకుందని ధ్వజమెత్తారు. కనీసం వలస కార్మికుల పట్ల కనికరం చూపలేదన్నారు. మతపరమైన పాలనలో బీజేపీ దిట్ట అని విరుచుకుపడ్డారు. వ్యవసాయ చట్టాల్లో రాష్ట్రాల సూచనలు పరిగణలోకి తీసుకోకుండా కొత్త చట్టాలు తీసుకువచ్చిందని.. వీటిపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి పై ఈడీ సోదాలు, దేశ ద్రోహం కింద కేసులు పెడుతుందని ధ్వజమెత్తారు. స్వదేశీ జాగరణ అని పిలుపునిచ్చిన బీజేపీ.. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయివేటికరణ చేసే దిశగా అడుగులు వేస్తోందని మండిపడ్డారు. దేశాన్ని అదాని, అంబానీలకు కట్టబెట్టేలా మోడీ సర్కార్ నిర్ణయాలు ఉన్నాయని విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని వైసీపీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య ఆరోపించారు.

Tags:    

Similar News