ఇది ప్రజల విజయం : సీఎం గెహ్లాట్

దిశ, వెబ్ డెస్క్: ఎట్టకేలకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన పంతం నెగ్గించకున్నారు. శుక్రవారం ప్రతిపక్ష బీజేపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీనిని ప్రజల విజయంగా సీఎం గెహ్లాట్ అభివర్ణించారు. దీంతో ఇన్నిరోజులుగా రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే .. తమకు పూర్తి బలముందని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ తెచ్చిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ సందర్బంగా […]

Update: 2020-08-14 09:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎట్టకేలకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన పంతం నెగ్గించకున్నారు. శుక్రవారం ప్రతిపక్ష బీజేపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీనిని ప్రజల విజయంగా సీఎం గెహ్లాట్ అభివర్ణించారు. దీంతో ఇన్నిరోజులుగా రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది.

రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే .. తమకు పూర్తి బలముందని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ తెచ్చిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ సందర్బంగా సీఎం గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ సర్కార్ గెలుపొందడంపై ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలు భగ్నం అయ్యాయని వివరించారు.

ఇది పూర్తిగా రాజస్థాన్ ప్రజల విజయమని గెహ్లాట్ పేర్కొన్నారు. ఇప్పుడు తాము సమష్టిగా కోవిడ్-19పై పోరాటం సాగిస్తామని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఎలాగైతే కుట్రలు చేసి అక్కడి ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించిందో అదే తరహా కుట్ర రాజస్థాన్‌లో కూడా జరిగిందన్నారు. అయితే, బీజేపీ పాచిక తమదగ్గర పారలేదని గెహ్లాట్ విమర్శించారు.

Tags:    

Similar News