ఒంటరిగా పోటీచేసి అధికారంలోకి వస్తాం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, మెదక్: 12 వందల మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకొని సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మహాసంగ్రామ యాత్ర మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం రంగంపేట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ… కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల […]
దిశ, మెదక్: 12 వందల మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకొని సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మహాసంగ్రామ యాత్ర మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం రంగంపేట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ… కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం హస్తగతం చేసుకుని దుర్మార్గపు పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేద విద్యార్థులు ఫీజులు చేల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి నేటివరకూ ఒక్క రైతుకు కూడా రుణ మాఫీ చేయలేదని తెలిపారు. కాంట్రాక్టర్లతో కల్వకుంట్ల కుటుంబం కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకుంటోందని సంచలన ఆరోపణ చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకొని పోటీ చేసిన పార్టీలని విమర్శించారు.
2024లో తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఏడేండ్లుగా ధనిక రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చి, భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఒక్కో కుటుంబంలో ఒక్కో మనిషిపై 1 లక్ష అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. దళిత బందు, మూడెకరాల భూమి అంటూ నమ్మించి, ఇప్పటికే దళితులను పలుమార్లు ముఖ్యమంత్రి మోసం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారని, ఆ పార్టీ ఓటు వేసి ఉపయోగం లేదని అన్నారు. ఉచిత వ్యాక్సిన్‌తో తెలంగాణ ప్రజలను ఆదుకున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్‌లో గణపతి నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో జరగాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సభలో బీజేసీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు, జనార్దన్ రెడ్డి, విజయ్, రవీందర్ రెడ్డి, సిద్దిరాములు, నందారెడ్డి, రాంచరణ్ యాదవ్, గడ్డం కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.