బీజేపీ క్యాంపెయిన్‌లో కాంగ్రెస్ ఎంపీ భార్య వీడియో క్లిప్

దిశ, చెన్నై: తమిళనాడులో బీజేపీ కోరికష్టాలను తెచ్చుకుంది. రాష్ట్ర సంస్కృతిని హైలైట్ చేయాలనే తపనతో యూట్యూబ్‌లోని భరత నాట్యానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను జత చేసి ట్వీట్ చేసింది. బీజేపీ మ్యానిఫెస్టోను ఓటర్లకు చేరువ చేసే ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టింది. కానీ, ఇది బీజేపీకి ముప్పు తెచ్చిపెట్టింది. ఆ వీడియో క్లిప్‌లోని కళాకారిణి ఇంకెవరో కాదు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సతీమణి శ్రీనిధి చిదంబరం. అంతేకాదు, డీఎంకే దివంగత లీడర్ కరుణానిధి ఆ […]

Update: 2021-03-30 22:50 GMT

దిశ, చెన్నై: తమిళనాడులో బీజేపీ కోరికష్టాలను తెచ్చుకుంది. రాష్ట్ర సంస్కృతిని హైలైట్ చేయాలనే తపనతో యూట్యూబ్‌లోని భరత నాట్యానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను జత చేసి ట్వీట్ చేసింది. బీజేపీ మ్యానిఫెస్టోను ఓటర్లకు చేరువ చేసే ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టింది. కానీ, ఇది బీజేపీకి ముప్పు తెచ్చిపెట్టింది. ఆ వీడియో క్లిప్‌లోని కళాకారిణి ఇంకెవరో కాదు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సతీమణి శ్రీనిధి చిదంబరం. అంతేకాదు, డీఎంకే దివంగత లీడర్ కరుణానిధి ఆ పాట రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలపై విమర్శించిన రోజే ఈ వీడియో క్లిప్‌ను బీజేపీ ట్వీట్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆన్‌లైన్‌లోనూ బీజేపీపై ట్రోల్స్ పోటెత్తాయి.

బీజేపీది ప్రాపగాండ

ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ విరుచుకపడింది. ‘సమ్మతి తీసుకోవడమనే కాన్సెప్ట్ బీజేపీకి అర్థమవడం చాలా కష్టమని మాకు అర్థమైంది. కానీ, శ్రీనిధి చిదంబరం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా ఆమె చిత్రాన్ని మీరు వినియోగించరాదు. ఈ చర్యతో మీ క్యాంపెయిన్ అంతా అబద్ధాలతో నిండి ఉన్నదని, అంతా ప్రాపగాండనే అని మీకు మీరుగా నిర్దారించారు’ అని కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ ఘాటుగా స్పందించింది. ఈ ట్వీట్‌పై శ్రీనిధి చిదంబరం అసహనం వ్యక్తంచేశారు. ఎట్టకేలకు బీజేపీ ఆ వీడియోను డిలీట్ చేసింది.

Tags:    

Similar News