చేదు కాకర కాయలో మేలుచేసే గుణాలు ఎన్నో..

దిశ, వెబ్‌డెస్క్ :  కాకర కాయ అంటే చాలామంది అయిష్టత చూపిస్తారు. చేదుగా ఉంటుందని దూరంగా ఉంటారు. కానీ దాన్ని ఓ టేస్ట్ చేస్తే మళ్లీ వదలరు. మాంసం కూరలను తలదన్నేలా కాకర కాయ కూర ఉంటుందనడంలో సందేహం లేదు. కాకర వేపుడును చూస్తే నోరు ఊరకుండ ఉండదు. కాకర రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనేక పరిశోధనల్లో రుజువైంది. చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. మంచి పోషకాలు, ఔషధ గుణాలు కాకరకాయలో […]

Update: 2021-04-15 23:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కాకర కాయ అంటే చాలామంది అయిష్టత చూపిస్తారు. చేదుగా ఉంటుందని దూరంగా ఉంటారు. కానీ దాన్ని ఓ టేస్ట్ చేస్తే మళ్లీ వదలరు. మాంసం కూరలను తలదన్నేలా కాకర కాయ కూర ఉంటుందనడంలో సందేహం లేదు. కాకర వేపుడును చూస్తే నోరు ఊరకుండ ఉండదు. కాకర రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనేక పరిశోధనల్లో రుజువైంది. చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. మంచి పోషకాలు, ఔషధ గుణాలు కాకరకాయలో మెండుగా లభ్యమవుతాయి. ఇంతకూ కాకర కాయ వల్ల ఏం లాభమో చూద్దాం..

  • శ్వాస కోస సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో కాకర రసం బాగా పని చేస్తుంది. తరచుగా కాకరకాయ తింటే జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు
  • కాలిన గాయాలను ,పుండ్ల ను మాన్పడంలో కాకరకాయలోని గుణాలు బాగా పని చేస్తాయి. రక్తాన్ని శుధ్ధి పరిచి గుండెకు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది.
  • బరువు తగ్గాలనుకున్నా,శరీరంలో అనవసర కొవ్వు కరగాలన్నా కాకర రసం తాగాలి. కాకరలోని యాంటీ ఆక్సిడెంట్ లు ఆరోగ్యాన్నీ కాపాడుతాయి
  • ఉదర సంబంధ వ్యాధులను కాకర మంచి ఔషధం. అందుకే రుచిలో చేదుగా ఉన్నా కాకరను తరచుగా తీసుకుంటే ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది.
  • కాకరకాయ శరీరంలోని వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వీటిని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్ల్లు దరిచేరవు.
Tags:    

Similar News