పెయింటర్ల కోసం బిర్లా వైట్ క్యాంపెయిన్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఎందరో ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా రోజువారీ కూలీల బతుకు దయనీయంగా మారింది. ఇప్పుడు అన్‌లాక్‌లో భాగంగా సడలింపులు వచ్చినప్పటికీ వారి బతుకులు బాగుపడలేదు. కావాల్సినంత పని దొరకక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ దీపావళి వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోయింది. అయితే దీపావళికి ముందు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. పాత గోడలను బాగు చేయించి, వాటికి రంగులు వేసుకుని పండగపూట లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించడాన్ని సంప్రదాయంగా […]

Update: 2020-11-15 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఎందరో ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా రోజువారీ కూలీల బతుకు దయనీయంగా మారింది. ఇప్పుడు అన్‌లాక్‌లో భాగంగా సడలింపులు వచ్చినప్పటికీ వారి బతుకులు బాగుపడలేదు. కావాల్సినంత పని దొరకక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ దీపావళి వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోయింది. అయితే దీపావళికి ముందు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. పాత గోడలను బాగు చేయించి, వాటికి రంగులు వేసుకుని పండగపూట లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించడాన్ని సంప్రదాయంగా పాటిస్తారు. గత కొన్ని దశాబ్దాల నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. దీని వల్ల పెయింటర్లకు ఈ సీజన్‌లో కావాల్సినంత పని దొరికేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

కొవిడ్ భయం, సామాజిక దూరం సమస్యల కారణంగా ఎవరూ ఇంటిని బాగు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఒకటి రెండు పనులు ఉన్నప్పటికీ లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నపుడు వారే స్వయంగా పెయింటింగ్ పనులు పూర్తి చేసుకున్నారు. దీని వల్ల పెయింటర్స్‌కు ఉపాధి లేకుండా పోయింది. అయితే వారి పరిస్థితి గురించి ప్రపంచానికి తెలియజేయడానికి అల్ట్రాటెక్ సిమెంట్ వారి బిర్లా వైట్ ఒక క్యాంపెయిన్ ప్రారంభించింది. ‘#దీవారోంకీసునో’ పేరుతో ఈ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది. దీనికి సంబంధించి హృదయానికి హత్తుకునేలా ఒక ప్రకటనను కూడా రూపొందించి విడుదల చేసింది. ఇప్పుడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొవిడ్ కారణంగా ప్రభావితమైన అన్ని రంగాల వారి గురించి ప్రపంచానికి తెలిసింది కానీ ఈ పెయింటర్ల పరిస్థితి గురించి పెద్దగా వెలుగులోకి రాలేదు. అందుకే వారి గురించి తెలియజెప్పి, వారికి అండగా నిలబడేందుకే తాము ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రకటించింది.

Tags:    

Similar News