తెరమీదకు విశ్వనాథన్ బయోపిక్
దిశ, వెబ్ డెస్క్: రెండు మూడేళ్లుగా సిల్వర్ స్క్రీన్‌పై బయోపిక్‌ల హవా నడుస్తుండగా, ఈ మధ్య క్రీడాకారుల జీవితాలు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫార్మర్ వరల్డ్ చాంపియన్, ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్ తెరకెక్కనున్నట్లు అధికారికంగా వెల్లడైంది. ఇప్పటికే ఎంతోమంది ఆనంద్ బయోపిక్ తీయాలని ప్రయత్నించినా, చెస్ రారాజు అందుకు సమ్మతించలేదు. తాజాగా ఆయన 51వ (డిసెంబర్ 11) పుట్టినరోజు సందర్భంగా తన బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మూవీ […]
దిశ, వెబ్ డెస్క్: రెండు మూడేళ్లుగా సిల్వర్ స్క్రీన్‌పై బయోపిక్‌ల హవా నడుస్తుండగా, ఈ మధ్య క్రీడాకారుల జీవితాలు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫార్మర్ వరల్డ్ చాంపియన్, ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్ తెరకెక్కనున్నట్లు అధికారికంగా వెల్లడైంది. ఇప్పటికే ఎంతోమంది ఆనంద్ బయోపిక్ తీయాలని ప్రయత్నించినా, చెస్ రారాజు అందుకు సమ్మతించలేదు. తాజాగా ఆయన 51వ (డిసెంబర్ 11) పుట్టినరోజు సందర్భంగా తన బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
15 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ విన్నర్, 19వ ఏట గ్రాండ్ మాస్టర్ టైటిల్, అతి చిన్న వయసులోనే పద్మశ్రీతో సత్కారం, ఆరుసార్లు చెస్ ఆస్కార్ టైటిల్, పద్మవిభూషణ్ అందుకున్న తొలి క్రీడాకారుడు.. ఇలా విశ్వనాథన్ ఆనంద్ సాధించిన ఘనతలెన్నో. ఆయన బాల్యంతో పాటు గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగిన తీరు, మూడు దశాబ్దాలుగా చెస్ రారాజుగా రాణిస్తున్న వైనాన్ని ఈ బయోపిక్‌లో ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతానికి సినిమా టైటిల్ రివీల్ చేయనప్పటికీ.. దీన్ని సన్‌డయల్ ఎంటర్‌టైన్‌మెంట్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్‌లు కలిసి నిర్మిస్తున్నాయి. ‘తను వెడ్స్ మను, జీరో’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. చెస్ చాంపియన్ ఆనంద్ పాత్రలో ఎవరు నటిస్తారో మరికొన్ని రోజుల్లో రివీల్ కానుంది.
BIOPIC ON VISWANATHAN ANAND… A biopic on #Indian chess grandmaster #ViswanathanAnand has been planned… The biopic – not titled yet – will be directed by Aanand L Rai… Produced by Sundial Entertainment [Mahaveer Jain] and Colour Yellow Productions [Aanand L Rai]. pic.twitter.com/fNBtdza2Dq
— taran adarsh (@taran_adarsh) December 13, 2020