గుర్రానికి గ్రాండ్‌గా పుట్టిన రోజు వేడుకలు.. ఎక్కడో తెలుసా?
దిశ, ఫీచర్స్ : సాధారణంగా మనుషులు జరుపుకునే పుట్టినరోజు వేడుకలు గురించి అందరికీ తెలిసిందే. కానీ తాజాగా బిహార్ చెందిన వ్యక్తి ఒకరు.. ఆశ్చర్యకరంగా గుర్రానికి బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించాడు. తను పెంచుకున్న గుర్రం చేత కేక్ కట్ చేయించిన ఆ వ్యక్తి.. అక్కడితో ఆగకుండా బంధుమిత్రులు, అతిథులందరికీ గ్రాండ్ పార్టీ కూడా అరేంజ్ చేసి గుర్రం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. బిహార్, సహస్ర డిస్ట్రిక్ట్ పంచవతిచౌక్‌కు చెందిన రజ్నీష్ కుమార్ అలియాస్ గోలుయాదవ్‌కు యానిమల్స్ […]
దిశ, ఫీచర్స్ : సాధారణంగా మనుషులు జరుపుకునే పుట్టినరోజు వేడుకలు గురించి అందరికీ తెలిసిందే. కానీ తాజాగా బిహార్ చెందిన వ్యక్తి ఒకరు.. ఆశ్చర్యకరంగా గుర్రానికి బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించాడు. తను పెంచుకున్న గుర్రం చేత కేక్ కట్ చేయించిన ఆ వ్యక్తి.. అక్కడితో ఆగకుండా బంధుమిత్రులు, అతిథులందరికీ గ్రాండ్ పార్టీ కూడా అరేంజ్ చేసి గుర్రం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు.
బిహార్, సహస్ర డిస్ట్రిక్ట్ పంచవతిచౌక్‌కు చెందిన రజ్నీష్ కుమార్ అలియాస్ గోలుయాదవ్‌కు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో మేల్ హార్స్‌ను తెచ్చుకుని పెంచుకుంటున్న రజ్నీష్.. దానికి ‘చేతక్’ అని పేరు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది గుర్రానికి ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన గోలుయాదవ్.. తాజాగా సెకండ్ బర్త్‌డేను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ సందర్భంగా గుర్రానికి పొద్దున్నే స్నానం చేయించిన గోలు.. పూలతో అందంగా అలంకరించి, అతిథుల మధ్య 22.5 కేజీల కేక్ కట్ చేయించారు. కాగా అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ఇప్పటివరకు తన బర్త్‌డే కూడా సెలబ్రేట్ చేసుకోలేదని, కానీ చేతక్ పుట్టిన రోజును గ్రాండ్‌గా నిర్వహించానని గోలుయాదవ్ గర్వంగా చెప్పడం విశేషం. 6 నెలల వయసున్నపుడు చేతక్‌ను ఇంటికి తీసుకొచ్చుకున్నానని, అది తనకు తన సొంత బిడ్డ లాంటిదని పేర్కొన్నారు. ప్రజెంట్ సొసైటీలో మనుషుల కంటే జంతువులే విశ్వాసంగా ఉంటాయని, ప్రతీ ఒక్కరు వాటిని ప్రేమించాలని కోరారు. జంతువులను హింసించొద్దని, తన దృష్టిలో అవి కూడా మనతో సమానమని వివరించారు.