సమీపించిన బీహార్ ఎన్నికలు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై అనిశ్చితికి తెరపడింది. అసెంబ్లీ గడువు ముగిసేలోపు ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 29లోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ ఉంటుందని వివరించారు. ఇదే సమయంలో ఒక లోక్‌సభ ఖాళీకి, ఇతర రాష్ట్రాల్లోని 65 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ఉపఎన్నికలు ఈ ఏడాది తొలినాళ్లలోనే నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా […]
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై అనిశ్చితికి తెరపడింది. అసెంబ్లీ గడువు ముగిసేలోపు ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 29లోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ ఉంటుందని వివరించారు. ఇదే సమయంలో ఒక లోక్‌సభ ఖాళీకి, ఇతర రాష్ట్రాల్లోని 65 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఈ ఉపఎన్నికలు ఈ ఏడాది తొలినాళ్లలోనే నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, అసోం సహా పలు రాష్ట్రాల్లో బైపోల్స్ జరగనున్న సంగతి తెలిసిందే. కరోనాను దృష్టిలో పెట్టుకుని బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ రాష్ట్రానికి అవసరానికి మించిన అదనంగా ఈవీఎంలను తరలించినట్టు, నిర్దేశిత సమయానికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి వరకూ అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయని సీఈసీ సునీల్ అరోరా వివరించారు. తగిన సమయంలో ఈ ఎన్నికల ప్రకటనలను ఈసీ చేస్తుందని పేర్కొన్నారు. కరోనా కాలంలోనూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఈసీ గతంలోనే విడుదల చేసిన సంగతి తెలిసిందే.