Ashwini Sri : రతిక 2.0 .. అశ్వినితో మరో లవ్ ట్రాక్ మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్?

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ కొత్త రూల్స్ పెట్టి నడిపిస్తున్నారు.

Update: 2023-10-11 04:40 GMT

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ కొత్త రూల్స్ పెట్టి నడిపిస్తున్నారు. అయినా ప్రేక్షకులు కొంత మంది బిగ్ బాస్ చూడటానికి ఇష్ట పడటం లేదు. బాగా ఆడే వాళ్లని బయటకు పంపిస్తే.. ఇంకెవరి కోసం చూడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రైతుబిడ్డ అనే సింపతీ కార్డు తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ . పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో అందరు షాక్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ప్రశాంత్ చాలా మారిపోయాడు. పల్లెటూరి నుంచి వచ్చాడు.. కసితో గేమ్ ఆడి ప్రేక్షకులను మెప్పిస్తాడు అనుకుంటే .. ఆ మధ్య రతికా వెనక తిరుగుతూ ఆడియన్స్ ను నిరాశపరిచాడు. ఇప్పుడేమో .. హౌస్ లోకి వచ్చిన హాట్ బ్యూటీ అశ్వినితో పులిహోర కలుపుతూ మరో లవ్ స్టోరీ మొదలు పెట్టాడు. నామినేషన్స్ సమయంలో శోభా శెట్టి, అశ్విని మధ్య వాదనలు జరిగిన విషయం తెలిసిందే. దాంతో శోభా అరిచి గోల చేయడంతో అశ్విని బిత్తరపోయింది. దెబ్బకు ఆమె ఏడ్చేసింది. అయితే కెప్టెన్ అనే ట్యాగ్ తగిలించుకుని ఆమెను ఓదార్చుతూ రైతు బిడ్డ ప్రశాంత్ పులిహోర కలిపాడు. ఎప్పుడు చూసిన ఆమె పక్కనే ఉంటున్నాడు. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు .. అసలు వీడు ఇంట్లోకి దేని కోసం వెళ్లాడు.. ? వెళ్లాక ప్రశాంత్ చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందా అంటూ సైటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News